స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన జెండా ఎగరేస్తాం
రిపోర్టర్: SINDERI KAMESH
స్థలం: జి.కె.వీధి
అల్లూరి సీతారామరాజు జిల్లా జి.కె.వీధి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం అత్యంత ఉత్సాహంగా జరిగింది. అరకు పార్లమెంట్ పరిధిలో పార్టీ విజయమే లక్ష్యంగా అరకు పార్లమెంట్ కోఆర్డినేటర్ కోరికాన రవికుమార్ ఆధ్వర్యంలో నేతలు వ్యూహరచన చేశారు. ఈ సమావేశంలో జనసేన సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ పాంగి కృష్ణారావు, గుంట కోటి, గెమ్మెలి పాల్సు తదితరులు పాల్గొని, పంచాయతీల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అంకితభావంతో పనిచేస్తామని స్పష్టం చేశారు.