ఓటర్ స్లిప్పుల గందరగోళం: యర్రగొండపాలెం పంచాయతీ కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్న జనం
రిపోర్టర్: అశోక్
స్థలం: యర్రగొండపాలెం
స్థానిక సంస్థల ఎన్నికల వేళ యర్రగొండపాలెం మండలంలో ఓటరు స్లిప్పుల పంపిణీలో తీవ్ర నిర్లక్ష్యం చోటుచేసుకుందని, పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాల ఓటర్లకు స్లిప్పులు అందకపోవడంతో గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద వందలాది మంది పడిగాపులు కాస్తున్నారని అధికారులు తెలిపారు. ఎన్నికల విధుల కారణంగా కొందరికి స్లిప్పులు అందలేదని, దీనిపై అధికారులకు తగిన ఆదేశాలు ఇస్తామని ఎన్నికల అధికారి బాలునాయక్ పేర్కొన్నారు.