హైదరాబాద్ యూనివర్సిటీలో పెద్దతుంబలం యువకుడికి పీహెచ్డీ డాక్టరేట్

రిపోర్టర్: KISHORE M స్థలం: ఆదోని

ఆదోని మండలం పెద్దతుంబలం గ్రామానికి చెందిన ఎరుకుల వెంకటేశ్వర్లు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఎకనామిక్స్ విభాగంలో పీహెచ్డీ డాక్టరేట్ పట్టా సాధించారు. పేద కుటుంబం నుంచి వచ్చి ఉన్నత విద్యలో ప్రతిభ చాటిన ఆయన, ప్రస్తుతం చెన్నైలో ఇండియన్ ఎకనామిక్ అగ్రికల్చరల్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆయన స్ఫూర్తిదాయకమని గ్రామస్థులు అభినందించారు.