గొర్రెల సంతకు కొత్త కళ: చౌటుప్పల్‌లో మార్కెట్ యార్డు ప్రారంభం
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
చౌటుప్పల్ పట్టణంలోని వలిగొండ రోడ్డు శివాలయం పక్కన యాభై లక్షల రూపాయలతో నిర్మించిన నూతన గొర్రెలు, మేకల మార్కెట్ యార్డును మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్‌గౌడ్ ప్రారంభించారు. గతంలో సరైన వసతులు లేక పెంపకందారులు ఇబ్బందులు పడ్డారని ఆమె తెలిపారు. క్రయవిక్రయాలకు ఈ యార్డు ఎంతగానో ఉపయోగపడుతుందని సింగిల్ విండో చైర్మన్ ఈడుదుల మస్తాన్ బాబు యాదవ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.