ఢిల్లీ హోటల్‌లో ఎయిరిండియా సీనియర్ పైలట్ మృతి

రిపోర్టర్: నరేష్ స్థలం: New Delhi

ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలోని ఓ లగ్జరీ హోటల్‌లో ఎయిరిండియాకు చెందిన 40 ఏళ్ల సీనియర్ పైలట్ శవమై కనిపించారు. గురువారం నుంచి హోటల్‌లో బస చేసిన ఆయన, శుక్రవారం ఫోన్ కాల్స్‌కు స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది తలుపులు బద్దలు కొట్టి చూడగా విగతజీవిగా పడి ఉన్నారు. శనివారం ఉదయం విమానం నడపాల్సి ఉండగా ఈ ఘటన జరగడం గమనార్హం.