హాలహర్విలో విషాదం: గంట వ్యవధిలో భార్యాభర్తలు మృతి చెందిన వైనం

రిపోర్టర్: నరేష్ స్థలం: కర్నూలు

కర్నూలు జిల్లా హాలహర్వి మండలం గూళ్యం గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న లింగమ్మ బళ్లారికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందగా, భార్య మరణ వార్త తట్టుకోలేక భర్త మస్తానప్ప కూడా గుండెపోటుతో మరణించినట్లు వెల్లడించారు. గంట వ్యవధిలోనే దంపతులు ఇద్దరూ ప్రాణాలు కోల్పోవడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.