గుజరాత్ లో ఏటీఎస్ పోలీసుల సంచలన అరెస్ట్: అంతర్జాతీయ డ్రగ్స్ డాన్ సలీం డోలా పట్టివేత
రిపోర్టర్: కిరణ్
స్థలం: వడోదర
గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ సలీం ఇస్మాయిల్ డోలాను అరెస్టు చేసినట్లు తెలిపారు. గతంలో వడోదర జిల్లాలో బయటపడ్డ రహస్య మెతడాడోన్ డ్రగ్ తయారీ కేంద్రం కేసులో ఈ కీలక అరెస్టు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. విదేశాల్ లో తలదాచుకున్న నిందితుడిపై గతంలో ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయని, ఈ ఉచ్చు ఆధారంగానే అతడిని అదుపులోకి తీసుకుని తీవ్రంగా విచారిస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.