'ఆధునిక సాంకేతికతపై పట్టు సాధించాలి': కాకినాడలో నూతన కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం

రిపోర్టర్: సురేష్ స్థలం: కాకినాడ

కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ కాకినాడలోని ఏపీఎస్పీ మూడో బెటాలియన్ శిక్షణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించారు. శిక్షణార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించేందుకు ఈ 30 నూతన కంప్యూటర్ ల్యాబ్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఎస్పీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. పోలీసు సిబ్బంది మరియు శిక్షణార్థులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.