జైపుర్ మోతీ డూంగ్రీ ఆలయంలో వైభవంగా సింజారా వేడుక
రిపోర్టర్: రాము
స్థలం: జైపుర్
రాజస్థాన్‌లోని ప్రసిద్ధ జైపుర్ మోతీ డూంగ్రీ ఆలయంలో వినాయక చవితిని పురస్కరించుకుని సింజారా పండుగను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో 3,500 కిలోల స్వచ్ఛమైన గోరింటాకును స్వామివారికి సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ మెహందీ ప్రసాదాన్ని స్వీకరిస్తే వివాహ యోగం కలుగుతుందని భక్తుల బలమైన నమ్మకం. దీంతో వివిధ రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంతం కిక్కిరిసిపోయింది.