జియో ఐపీవో వాల్యూయేషన్ చాలా ఎక్కువంటూ విదేశీ ఫండ్ మేనేజర్ల స్పష్టం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: హైదరాబాద్

జియో ప్లాట్ఫారమ్స్ ఐపీవో వాల్యూయేషన్ అత్యంత భారీగా ఉందని విదేశీ ఫండ్ మేనేజర్లు ఆకాశ్ అంబానీతో పేర్కొన్నట్లు బ్లూమ్బెర్గ్ నివేదించింది. హాంగ్ కాంగ్, సింగపూర్, లండన్ దేశాలలో జరిగిన అంతర్జాతీయ సమావేశాలలో ఆకాశ్ అంబానీ పాలుపంచుకున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. జియో కేవలం టెలికాం ఆపరేటర్ కాదని, టెక్ దిగ్గజమని ఫైనాన్షియల్ సంస్థలను ఒప్పించే బాధ్యతను ఆయన భుజాన వేసుకున్నారని వార్తలు వచ్చాయి. భారతీ ఎయిర్టెల్తో పోలిస్తే జియోకు ప్రీమియం ఎందుకు చెల్లించాలని మదుపర్లు ప్రశ్నించినట్లు ఆ వర్గాలు తెలిపాయి.