విశాఖ తూర్పు నౌకాదళంలో కలకలం: హనీట్రాప్‌లో చిక్కుకుని నేవీ రహస్యాలు లీక్
రిపోర్టర్: నరేష్
స్థలం: Visakhapatnam
విశాఖపట్నం తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న సైలర్ ప్రదీప్ ముఖర్జీ పాకిస్థాన్ మహిళా ఏజెంట్ విసిరిన హనీట్రాప్‌లో చిక్కుకుని దేశ భద్రతా సమాచారాన్ని చేరవేశాడని కౌంటర్ ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమైన నకిలీ ప్రొఫైల్‌కు యుద్ధనౌకలు, సబ్మెరైన్ల కదలికల సమాచారం చేరవేయడంతో నిఘా వర్గాలు అతడిని అరెస్టు చేసి లోతుగా విచారిస్తున్నాయి.