రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్: త్వరలో పట్టాలెక్కనున్న వందే భారత్ స్లీపర్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: కాచిగూడ

నగరవాసులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వందే భారత్ స్లీపర్ రైళ్లు త్వరలో పట్టాలెక్కనున్నాయని రైల్వే అధికారులు తెలిపారు. ఇప్పటికే కాచిగూడ, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి నడుస్తున్న వందే భారత్ ఛైర్ కార్ రైళ్లకు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభిస్తోందని పేర్కొన్నారు. అయితే పగటి వేళల్ లో దూర ప్రాంతాలకు కూర్చొని ప్రయాణించడం కొంత ఇబ్బందికరంగా మారడంతో, ఈ స్లీపర్ కోచ్లు అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు ఎంతో ఉపశమనం కలుగుతుందని అధికారులు వెల్లడించారు.