కాంగో నదిలో ఘోర ప్రమాదం: రెండు పడవలు ఢీకొని ముప్పై మంది దుర్మరణం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: కాంగో
ఆఫ్రికా దేశమైన కాంగోలో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో ముప్పై మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. కాంగో నదిపై ప్రయాణిస్తున్న రెండు మోటారు పడవలు రాత్రి సమయంలో వేగంగా ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో పలువురు ప్రయాణికులు గల్లంతు కాగా, సహాయక బృందాలు నదిలో మునిగిపోయిన వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.