మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే ఉపేక్షించం: సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్ర చారి

రిపోర్టర్: సతీష్ స్థలం: ఎల్లారెడ్డిపేట

మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని సిరిసిల్ల డీఎస్పీ కె.నాగేంద్ర చారి హెచ్చరించారు. ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన సయ్యద్ జుబేర్ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ భంగం కలిగించడంతో అతని నేర ప్రవృత్తిని పరిగణనలోకి తీసుకుని రౌడీషీట్ ఓపెన్ చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. మహిళలు వేధింపులకు గురైతే భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని ఆయన సూచించారు.