యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ప్లాట్‌ఫామ్ ఫీజు లేదు

రిపోర్టర్: కిరణ్ స్థలం: అమరావతి

యూపీఐ వినియోగదారులకు శుభవార్త అందిస్తూ బిల్ చెల్లింపులు సహా డిజిటల్ లావాదేవీలపై ఎలాంటి అదనపు ప్లాట్‌ఫామ్ ఫీజు ఉండదని ఎన్‌పీసీఐ స్పష్టం చేసింది. రెండు వేల రూపాయల లోపు చెల్లింపులకు సున్నా మర్చంట్ డిస్కౌంట్ రేటు వర్తిస్తుందని వెల్లడించింది. అదనపు ఛార్జీల భారం లేకుండా ప్రజలు మరింత సులభంగా, సౌకర్యవంతంగా డిజిటల్ చెల్లింపులను కొనసాగించవచ్చని తేల్చిచెప్పింది.