వైకాపా హయాంలో పంటల బీమాను నిర్లక్ష్యం చేశారంటూ మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం
రిపోర్టర్: సునీల్
స్థలం: అమరావతి
ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టి జలధార-జలహారతి ద్వారా రూ.3,409 కోట్లతో పనులు పూర్తి చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు తెలిపారు. అమరావతిలో ఆయన మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో రెండేళ్లు ప్రీమియం చెల్లించకుండా రైతులను మోసం చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాయలసీమలో ఉద్యాన హబ్ ఏర్పాటుతో పాటు పంటల బీమా, సూక్ష్మసేద్యం బకాయిలను చెల్లిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.