సమవర్తి అడ్వెంచరస్ జర్నీ ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది

రిపోర్టర్: సురేష్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్‌లో నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో సత్యదేవ్ మాట్లాడుతూ సమవర్తి సినిమా షూటింగ్ సమయంలో అడవి జంతువులు, పాములను ప్రత్యక్షంగా చూశామని, ఇదొక అడ్వెంచరస్ జర్నీ అని తెలిపారు. అజయ్‌నాగ్.వి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఎకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌లో శ్రీకాంత్ కీలక పాత్ర పోషిస్తుండగా, త్వరలోనే ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.