సోమారంలో ఘనంగా పోషణ మాసోత్సవాల అవగాహన కార్యక్రమం

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని సోమారం గ్రామంలో పోషణ మాసోత్సవాలను శనివారం ఘనంగా నిర్వహించారు. బొందుగుల సెక్టార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గర్భిణీలు, బాలింతలు, ప్రీ ప్రైమరీ విద్యార్థుల తల్లులకు పోషకాహార విలువలపై అవగాహన కల్పించారు. అంగన్వాడీ టీచర్ భూలక్ష్మి నిర్వహించిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ గొలుసుల అనూష యాకుబ్, ప్రధానోపాధ్యాయురాలు అమృత అతిధులుగా పాల్గొని నమూనా పోషకాహారాన్ని ప్రదర్శించారు.