గణేష్ శోభాయాత్రలో ఇరువర్గాల ఘర్షణ నలుగురికి తీవ్ర గాయాలు

రిపోర్టర్: సురేష్ స్థలం: నల్గొండ

చందంపేట మండలం చింతపల్లిలో గురువారం అర్ధరాత్రి గణేష్ శోభాయాత్ర సందర్భంగా జరిగిన తీవ్ర ఘర్షణలో నలుగురికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. ఈ అకస్మాత్తు జరిగిన ఘర్షణలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని, మరికొందరికి తలలకి బలమైన గాయాలయ్యాయని అధికారులు పేర్కొన్నారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉండగా, పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు.