అమితాబ్ బచ్చన్ ని అలా పిలవొద్దని చెప్పిన తండ్రి: బిగ్ బి ఆసక్తికర వ్యాఖ్యలు

రిపోర్టర్: హరి స్థలం: Mumbai

ప్రముఖ క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్పతి తాజా ఎపిసోడ్ లో తన భార్య జయ బచ్చన్ తో పెళ్లి కొత్త రోజులకు సంబంధించిన మధుర జ్ఞాపకాలను ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ పంచుకున్నారని బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. తనను జయ బచ్చన్ ఎంతో ప్రేమగా లంబు జీ అని పిలిచేవారని, అయితే తన తండ్రి హరివంశ్రాయ్ బచ్చన్ జోక్యం చేసుకుని అలా పిలవడం ఆపేయాలని కోరారని అమితాబ్ సరదాగా వివరించారు.