మాతృశ్రీ డిగ్రీ కళాశాలలో ఘనంగా తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలు
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
చౌటుప్పల్ పట్టణంలోని మాతృశ్రీ డిగ్రీ కళాశాలలో తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు సేవలను స్మరించుకుంటూ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కళాశాల ప్రిన్సిపాల్ బి. మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ భాషా సంస్కృతి పరిరక్షణకు విద్యార్థులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కాళోజీ ఆశయాలను కొనియాడారు.