స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అరాచకాలను సాగనివ్వబోమంటూ సీఎం చంద్రబాబు హెచ్చరిక

రిపోర్టర్: అశోక్ స్థలం: Amaravati

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అరాచకాలను సాగనివ్వబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. స్వచ్ఛ రాజకీయాలకు నాంది పలుకుతూ సేవా భావమే పునాదిగా అభ్యర్థులను ఎంపిక చేశామని తెలిపారు. బీసీలకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ సామాజిక న్యాయం అమలు చేశామని, గత ప్రభుత్వం నిధులను మళ్లించిందని విమర్శించారు. అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యంగా కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.