స్టెనోగ్రాఫర్ గ్రేడ్ పరీక్ష ప్రాథమిక కీ విడుదల చేసిన ఎస్ఎస్సీ
రిపోర్టర్: శివ
స్థలం: న్యూఢిల్లీ
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి మరియు డి పరీక్ష 2026కి సంబంధించి ప్రాథమిక కీని విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ ఉపయోగించి ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తప్పులపై అభ్యంతరాలను సెప్టెంబర్ 26వ తేదీలోగా తెలియజేయాలని కమిషన్ సూచించింది. ప్రశ్న లేదా సమాధానంపై ఒక్కో అభ్యంతరానికి యాభై రూపాయల రుసుము చెల్లించాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 9 నుంచి 12 వరకు ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్షలు దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో విజయవంతంగా నిర్వహించారు.