ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ప్రవేశ పత్రాలు విడుదల
రిపోర్టర్: కృష్ణ
స్థలం: భారతదేశం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూనియర్ అసోసియేట్ రిక్రూట్మెంట్ ప్రిలిమినరీ పరీక్షల ప్రవేశ పత్రాలను విడుదల చేసింది. ఈనెల 26, 27 తేదీల్లో ఆన్లైన్ విధానంలో పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ వివరాలు నమోదు చేసి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని బ్యాంక్ అధికారులు తెలిపారు.