గుంతకల్లులో గృహిణిని కత్తితో గాయపరిచి లక్షల నగలు ఎత్తుకెళ్లిన దొంగలు
రిపోర్టర్: గోపి
స్థలం: అనంతపురం
శ్రీసత్యసాయి జిల్లా గుంతకల్లు పట్టణంలోని కోయనగర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మనోజ్ కుమార్ ఇంటిలో సోమవారం సాయంత్రం ఇద్దరు ముసుగు దొంగలు బీభత్సం సృష్టించారు. తాగునీటి నెపంతో లోపలికి ప్రవేశించి, నివేదితను కత్తితో గాయపరిచి, పసిపాప మెడపై కత్తి ఉంచి బెదిరించారు. ఇంట్లో ఉన్న అరవై లక్షల విలువైన బంగారు నగలు, రెండు లక్షల నగదును దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.