జీవో 118 నిబంధనలు తొలగించి యాజమాన్య హక్కులు
రిపోర్టర్: కిరణ్
స్థలం: తెలంగాణ
తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జీవో నంబర్ 118 నిబంధనలను తొలగించి, పూర్తి యాజమాన్య హక్కులను కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గతంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.