విద్యార్థులకు అలర్ట్: త్వరలోనే జేఈఈ మెయిన్ 2027 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
రిపోర్టర్: హరి
స్థలం: New Delhi
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ త్వరలో జేఈఈ మెయిన్ 2027 పరీక్షా దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించనుందని అధికారులు వెల్లడించారు. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష రాయాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జనవరి సెషన్ పరీక్షలు జనవరి 22 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పరీక్షను మొత్తం పదమూడు భాషలలో నిర్వహిస్తున్నట్లు ఎన్టీఏ అధికారులు స్పష్టం చేశారు.