బిగ్ బాస్ తెలుగు 10 హౌస్ నుంచి నటుడు కృష్ణుడు ఎలిమినేట్
రిపోర్టర్: కిరణ్
స్థలం: Hyderabad
బిగ్ బాస్ తెలుగు 10 సీజన్‌లో రెండో వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా నటుడు కృష్ణుడు ఇంటి నుంచి బయటకు వచ్చారు. మొదటి వారంలో చైత్ర రాయ్ ఎలిమినేట్ కాగా, రెండో వారంలో తక్కువ ఓట్లు రావడంతో కృష్ణుడు హౌస్‌ను వీడాల్సి వచ్చింది. హౌస్‌లో ఆశించిన స్థాయిలో ఆటతీరు ప్రదర్శించలేకపోవడం, టాస్కుల్లో చురుగ్గా పాల్గొనకపోవడం ఆయన ఎలిమినేషన్‌కు కారణమని తెలుస్తోంది. దాదాపు రెండు వారాలు హౌస్‌లో కొనసాగిన కృష్ణుడి ప్రయాణం ముగియడంతో ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో మిగతా కంటెస్టెంట్ల మధ్య పోటీ మరింత ఆసక్తికరంగా మారింది.