నితారీ హత్యల కేసు నిందితుడు సురేంద్ర కోలి మృతి
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: ఉత్తరాఖండ్
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో నితారీ హత్యల కేసు నిందితుడు సురేంద్ర కోలి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. నోయిడాలోని నితారీ హత్యల కేసులో గత నవంబర్‌లో నిర్దోషిగా విడుదలైన సురేంద్ర కోలి, హరిద్వార్‌లోని ఒక టీ స్టాల్‌లో విగతజీవిగా పడి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అల్మోడాకు చెందిన కోలి కొద్ది రోజుల క్రితమే అక్కడ టీ బండి పెట్టుకుని జీవిస్తున్నారు. ఘటనా స్థలంలో ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదని, కుటుంబ సభ్యులకు సమాచారం అందించి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.