అమెరికాలో ఘోర విమాన ప్రమాదం: ట్రంప్ నివాసం సమీపంలో బిజినెస్ జెట్ కూలిపోవడంతో తొమ్మిది మంది మృతి
రిపోర్టర్: అశోక్
స్థలం: Florida
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో తొమ్మిది మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నివాసానికి సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. టెక్సాస్ నుంచి బయలుదేరిన బిజినెస్ జెట్ అత్యంత వేగంగా నడిరోడ్డుపై కూలిపోయి అగ్నిగోళంగా మారిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ దర్యాప్తు చేపట్టింది.