ముంబయిలో మోదీ పర్యటన వేదిక వద్ద నకిలీ పీఎంఓ అధికారి అరెస్ట్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: మహారాష్ట్ర

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముంబయి పర్యటన నేపథ్యంలో తీవ్ర భద్రతా వైఫల్యం తప్పింది. మోదీ పాల్గొనే కార్యక్రమ వేదిక వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నకిలీ పీఎంఓ ఐడీ కార్డుతో పాటు ఒక తుపాకిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో ప్రధాని రాకకు ముందే పోలీసులు ముంబయిలో హై అలర్ట్ ప్రకటించి విచారణ చేపట్టారు.