ఓట్ల చోరీ దేశ రాజ్యాంగంపై జరిగిన ప్రత్యక్ష దాడి
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: న్యూఢిల్లీ
ఓట్ల చోరీ అనేది భారత ప్రజలపై జరిగిన తీవ్రమైన నేరమని, ఇది రాజ్యాంగంపై జరుగుతున్న ప్రత్యక్ష దాడని రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఈ కుట్ర వెనుక బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఎన్నికల సంఘం ఉన్నాయని, వీరంతా దేశద్రోహానికి పాల్పడ్డారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ అక్రమాలకు పాల్పడిన వారికి త్వరలోనే చట్టపరంగా తగిన శిక్ష తప్పదని, న్యాయం కచ్చితంగా గెలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.