కుటుంబ విలువలు తెలియని వ్యక్తి జగన్ అంటూ మంత్రి నిమ్మల ధ్వజం
రిపోర్టర్: కిరణ్
స్థలం: పశ్చిమ గోదావరి
సొంత మేనకోడలు వివాహం తన ఇంట్లో చేయడానికి అంగీకరించని, కుటుంబ విలువలు తెలియని వ్యక్తి వైఎస్ జగన్ అని రాష్ట్ర జల వనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలంలో ఆదివారం రాత్రి జరిగిన ఎంపీటీసీ అభ్యర్థుల పరిచయ కార్యక్రమంలో మంత్రి నిమ్మల పాల్గొని జగన్పై ఘాటు విమర్శలు గుప్పించారు. మేనకోడలు వివాహం అంటే మేనమామ స్వయంగా దగ్గరుండి జరిపించాలని, సొంత కుటుంబానికే న్యాయం చేయలేని జగన్ రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారని ఆయన నిలదీశారు.