డెర్బీ మ్యాచ్‌లో మోహన్ బగాన్, ఈస్ట్ బెంగాల్ డ్రా

రిపోర్టర్: సునీల్ స్థలం: పశ్చిమ బెంగాల్

కోల్‌కతాలోని బరాసత్‌లో జరిగిన సీఎఫ్‌ఎల్ ప్రీమియర్ డివిజన్ డెర్బీ మ్యాచ్‌లో మోహన్ బగాన్, ఈస్ట్ బెంగాల్ జట్లు 1-1 గోల్స్ తో డ్రాగా ముగిశాయి. మోహన్ బగాన్ ఆటగాడు మన్‌వీర్ సింగ్ తొలి అర్ధభాగంలో గోల్ చేసి ఆధిక్యం అందించగా, ద్వితీయార్ధంలో ఈస్ట్ బెంగాల్ ఆటగాడు మొహమ్మద్ బిలాల్ అద్భుతమైన హెడర్ ద్వారా గోల్ చేసి మ్యాచ్‌ను సమం చేశారు.