జగిత్యాలలో దారుణం: హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేస్తున్న శిశు సంక్షేమ శాఖ
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: జగిత్యాల
జగిత్యాల జిల్లాలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ మూడేళ్ల చిన్నారిని పెంచిన తల్లిదండ్రులకు అప్పగించడంలో అధికారులు జాప్యం చేస్తున్నారని ఆ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ సంప్రదాయం ప్రకారం దత్తత తీసుకున్న బాలుడిని అధికారులు శిశు సంక్షేమ కేంద్రానికి తరలించడంతో పసివాడు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నాడు. కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా అధికారులు కొర్రీలు పెడుతున్నారని, తమ బిడ్డను వెంటనే అప్పగించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.