అవయవ మార్పిడి చట్ట సవరణకు గవర్నర్ ఆమోదముద్ర

రిపోర్టర్: భాస్కర్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదించిన మానవ అవయవ మార్పిడి సవరణ చట్టానికి గవర్నర్ ఆమోదముద్ర వేశారు. అవయవాల అక్రమ రవాణాను అరికట్టడంతో పాటు ప్రక్రియను పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం ఈ సవరణ తెచ్చింది. చట్టపరిధిని విస్తరించి కణజాలాల మార్పిడిని సైతం చట్టబద్ధం చేశారు. అవయవాల కొరతను తగ్గించేందుకు సమీప బంధువుల జాబితాలో అవ్వ-తాత, మనవడు-మనవరాళ్లను దాతలుగా చేర్చుతూ వెసులుబాటు కల్పించారు.