బీజేపీ లేబర్ సెల్ జిల్లా కన్వీనర్‌గా జంపాల శ్రీనివాస్ నియామకం
రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి
స్థలం: ఆత్మకూరు(ఎం)
బీజేపీ లేబర్ సెల్ యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్‌గా జంపాల శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర లేబర్ సెల్ కన్వీనర్ అందె శ్రీనివాస్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.
కార్మికుల సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని శ్రీనివాస్ తెలిపారు. పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా పనిచేస్తానని, సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.