పోటీ పరీక్షల సిలబస్ మార్పులపై స్పష్టతనిచ్చిన టీజీపీఎస్సీ

రిపోర్టర్: నరేష్ స్థలం: తెలంగాణ

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగ నియామక పోటీ పరీక్షల సిలబస్‌లో మార్పులు జరగనున్నాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పష్టతనిచ్చింది. సిలబస్‌ను పునర్వ్యవస్థీకరించడానికి ఎలాంటి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి పాత సిలబస్ ప్రకారమే ప్రిపరేషన్ కొనసాగించాలని, పెద్ద ఎత్తున మార్పులు చేయాల్సి వస్తే కనీసం ఒక సంవత్సరం ముందే ప్రకటిస్తామని టీజీపీఎస్సీ కార్యదర్శి వెల్లడించారు.