గ్లోబల్ చెస్ లీగ్‌పై దృష్టి పెట్టానన్న భారత గ్రాండ్‌మాస్టర్ నిహాల్ సారిన్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Karnataka

గ్లోబల్ చెస్ లీగ్‌లో అమెరికన్ గాంబిట్స్ తరఫున ఆడుతున్న భారత గ్రాండ్‌మాస్టర్ నిహాల్ సారిన్ ప్రస్తుతానికి టోర్నమెంట్‌పైనే పూర్తి దృష్టి సారించినట్లు తెలిపారు. త్వరలో జరగనున్న చెస్ ఒలింపియాడ్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించడంపై ఎంతో ఉత్సాహంగా ఉన్నానని, జట్టు కోసం తన ఉత్తమ ప్రదర్శన ఇస్తానని పేర్కొన్నారు. ప్రస్తుతం జీసీఎల్‌లో రిలాక్స్‌డ్‌గా ఆడుతూ మ్యాచ్‌లను ఆస్వాదిస్తున్నట్లు వెల్లడించారు.