ఏపీలో భారీ పెట్టుబడితో రానున్న హ్యుందాయ్ మెగా షిప్‌యార్డ్
రిపోర్టర్: శివ
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌లో రూ.34,000 కోట్ల భారీ పెట్టుబడితో హెచ్‌డీ హ్యుందాయ్ మెగా షిప్‌యార్డ్‌ను ఏర్పాటు చేయనుంది. మంత్రి నారా లోకేష్ చొరవతో తమిళనాడుకు వెళ్లాల్సిన ఈ ప్రాజెక్టు ఏపీకి దక్కింది. రాష్ట్ర సుదీర్ఘ తీరప్రాంతం, అనుకూల పారిశ్రామిక విధానాలతో ఈ భారీ ప్రాజెక్టు సాకారం కానుంది. ఇది రాష్ట్ర పారిశ్రామిక చరిత్రలో మైలురాయిగా నిలవడమే కాకుండా, వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలను కల్పించనుంది.