వెంకటాచలంలో వైభవంగా గుమ్మడి రాజా యాదవ్ జన్మదిన వేడుకలు: పేదలకు దుప్పట్ల పంపిణీ

రిపోర్టర్: sujith reddy స్థలం: వెంకటాచలం

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లి పంచాయతీలో శనివారం తిరుపతి నియోజకవర్గ సంస్థాగత ఎన్నికల పరిశీలకులు గుమ్మడి రాజా యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. రాజన్న సైన్యం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాజా యాదవ్ కేక్ కట్ చేశారు. అనంతరం అభిమానులు భారీ మోటార్ బైక్ ర్యాలీ, బాణసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నిరుపేదలకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ వేడుకల్లో పలువురు టిడిపి నేతలు పాల్గొన్నారు.