అమెరికాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు: షార్లెట్లో ఉత్సాహంగా వేడుకలు

రిపోర్టర్: విజయ్ స్థలం: షార్లెట్

అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం షార్లెట్ నగరంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించినట్లు తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ షార్లెట్ ఏరియా నిర్వాహకులు తెలిపారు. TAGCA సంస్థ ఇరవయ్యో వార్షికోత్సవం సందర్భంగా హిందూ సెంటర్ ప్రాంగణంలో ఈ వేడుకలు జరిగాయి. మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మలను పేర్చి సాంప్రదాయాన్ని చాటారు. విదేశాల్లోనూ తెలంగాణ సంస్కృతిని పరిరక్షించేలా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.