నిజామాబాద్ మాధవనగర్ ఆర్వోబీ పూర్తికి అదనపు నిధులు కోరిన అర్వింద్ ధర్మపురి
రిపోర్టర్: హరి
స్థలం: నిజామాబాద్
మాధవనగర్ ఆర్వోబీ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసేందుకు ఎనిమిది కోట్ల అరై ఎనిమిది లక్షల రూపాయల అదనపు పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేయాలని కోరుతూ తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను అరవింద్ ధర్మపురి కలిశారు. ఈ మేరకు హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా భేటీ అయిన ఆయన నిధుల మంజూరుపై విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞటనపై ఉపముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు అరవింద్ ధర్మపురి వెల్లడించారు.