మహిళల టీవ్టీ సిరీస్ క్లీన్ స్వీప్: జింబాబ్వేపై భారత్ ఘన విజయం

రిపోర్టర్: మహేష్ స్థలం: రాయ్‌పూర్

రాయ్పూర్ వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో టీవ్టీ మ్యాచ్లో భారత మహిళల జట్టు తొంభై రెండు పరుగుల తేడాతో ఘన విజయం సాధించిందని క్రీడా వర్గాలు వెల్లడించాయి. ఈ గెలుపుతో మూడు మ్యాచ్ల సిరీస్ను మూడు సున్నా తేడాతో భారత్ క్లీన్ స్వీప్ చేసింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ తొంబై ఒకటి పరుగులతో నాటౌట్గా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించగా, బౌలర్లు సత్తా చాటారు.