యూఏస్ యూనివర్సిటీకి భారీ విరాళం: ఉచిత విద్య అందిస్తున్న స్టీఫెన్ ఆడమ్స్
రిపోర్టర్: రమేష్
స్థలం: అమెరికా
అమెరికాలోని యెల్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్‌లో ప్రవేశం పొందే విద్యార్థులకు ట్యూషన్ ఫీజు పూర్తిగా మాఫీ అవుతుందని యూనివర్సిటీ వర్గాలు వెల్లడించాయి. దాత స్టీఫెన్ ఆడమ్స్, డెనిస్ ఆడమ్స్ దంపతులు రెండు దశాబ్దాల క్రితం అందించిన వంద మిలియన్ డాలర్ల భారీ విరాళం కారణంగా ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని అధికారులు తెలిపారు. దీనివల్ల సంగీత విద్యార్థులకు ఆర్థిక భారం తొలగిపోయిందని, అకడమిక్ కార్యక్రమాలు మరింత మెరుగయ్యాయని వారు స్పష్టం చేశారు.