జమ్మూలో కలకలం: సీనియర్ ఆర్మీ అధికారి భార్యపై గూఢచర్యం కేసు నమోదు

రిపోర్టర్: రాజేష్ స్థలం: జమ్మూ

జమ్మూలో సీనియర్ ఆర్మీ అధికారి భార్య పాలపర్తి నాగ అనఘా లక్ష్మిపై గూఢచర్యానికి సంబంధించిన కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. చైనా సహా పలు విదేశీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో ఆమెకు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని విదేశీ వ్యక్తులకు చేరవేశారనే అనుమానాలు వ్యక్తమవుతుండటంతో, రక్షణ రంగంలో ఈ ఉదంతం తీవ్ర కలకలం రేపింది.