వైద్య రంగంలో అద్భుతం: రోబోటిక్ సర్జరీతో భారీ గర్భాశయ కంతుల తొలగింపు

రిపోర్టర్: మహేష్ స్థలం: Hyderabad

గర్భాశయంలో ఏర్పడిన సుమారు పది భారీ కంతులను వైద్యులు రోబోటిక్ సర్జరీ ద్వారా విజయవంతంగా తొలగించినట్లు వైద్య నిపుణులు వెల్లడించారు. తీవ్రమైన రక్తస్రావంతో బాధపడుతున్న ముప్ పై ఏళ్ల మహిళకు గర్భాశయం తొలగించకుండానే డా విన్సీ సర్జికల్ సిస్టమ్ సహాయంతో ఈ సంక్లిష్ట శస్త్రచికిత్సను పూర్తి చేసినట్లు తెలిపారు. రోగి కోరిక మేరకు గర్భాశయాన్ని సంరక్షిస్తూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వైద్యులు అరుదైన విజయం సాధించారని పేర్కొన్నారు.