ముక్కవారిపల్లి పోలింగ్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఓబులవారిపల్లి

తిరుపతి జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గ పరిధిలోని ఓబులవారిపల్లి మండలం ముక్కవారిపల్లిలో ఏర్పాటు చేసిన ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రంలో కల్పించిన మౌలిక వసతులు, ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను నిశితంగా పరిశీలించారు. రాబోయే ఎన్నికలు పూర్తిగా ప్రశాంతంగా, పారదర్శక వాతావరణంలో జరిగేలా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.