తుఫాన్ల నష్టంపై కేంద్రానికి లేఖ: మధ్యంతర ఆర్థిక సాయం కోరిన చంద్రబాబు
రిపోర్టర్: మహేష్
స్థలం: Andhra Pradesh
అర్నబ్, మురసు వంటి వరుస తుఫాన్లతో రాష్ట్రానికి భారీ నష్టం వాటిల్లిందని, ఉపశమనం కోసం తక్షణమే మధ్యంతర ఆర్థిక సాయం అందించాలని కోరుతూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లేఖ రాసినట్లు సీఎంఓ ఆంధ్రప్రదేశ్ వెల్లడించింది. ఒక్క మురసు తుఫాన్ కారణంగానే రాష్ట్రంలో ప్రాథమికంగా సుమారు 1,919 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు ఆ లేఖలో ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.