వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు

రిపోర్టర్: విజయ్ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రూపాయి కాదు ఏకంగా నలభై మూడు వేల కోట్ల రూపాయల భారీ అక్రమాస్తుల కేసులో పదిహేనేళ్లు గడిచినా ఇప్పటివరకు విచారణ ప్రారంభం కాకపోవడం దారుణమని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజువారీ విచారణ కాకుండా రోజంతా విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అలాగే అద్వానీ వంటి అగ్రనేతల కేసుల్లో వేగంగా తీర్పులు వచ్చాయని గుర్తుచేస్తూ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చట్టం కంటే గొప్పవారా అని ఆయన ప్రశ్నించారు.